Adilabad District: రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి.. మొక్కు తీర్చుకున్న మహిళ

Woman Drink 2 and Half Kilo Cooking Oil In Kamdev Jatara

      


రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగిన ఓ మహిళ మొక్కు చెల్లించుకుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లోని ఖాందేవుని జాతరలో ఈ ఘటన జరిగింది. తొడసం వంశస్థుల ఆరాధ్య దైవమైన ఖాందేవుని జాతర ఇక్కడ ప్రతి ఏడాది జనవరిలో సంక్రాంతి నాడు మొదలవుతుంది. 

ఈ సందర్భంగా తొడసం వంశస్థుల ఇళ్ల నుంచి పూజకు నువ్వుల నూనె సేకరిస్తారు. ఆ వంశానికి చెందిన ఆడపడుచు ఈ నూనె తాగి మొక్కు చెల్లించుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఈ క్రమంతో ఆ వంశానికి చెందిన ఆడబిడ్డ నాగూబాయి చందు రెండున్నర కిలోల నువ్వుల నూనెను తాగి మొక్కు తీర్చుకుంది. కాగా, పెద్ద ఎత్తున జరిగే ఈ జాతరకు మహారాష్ట్ర, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

  • Loading...

More Telugu News