Ghaati: ఆస‌క్తిక‌రంగా 'ఘాటి' దేశీరాజు గ్లింప్స్

Desi Raju glimpse from Ghaati Movie

  • అనుష్క శెట్టి, క్రిష్ కాంబోలో 'ఘాటి'
  • ఏప్రిల్ 18న విడుద‌ల కానున్న సినిమా
  • మూవీలో దేశీరాజు అనే కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న త‌మిళ న‌టుడు విక్ర‌మ్ ప్ర‌భు  
  • తాజాగా ఆయ‌న తాలూకు గ్లింప్స్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌

టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ష‌న్‌లో సీనియ‌ర్ న‌టి అనుష్క శెట్టి న‌టిస్తున్న తాజా చిత్రం 'ఘాటి'. ఈ సినిమాలో త‌మిళ న‌టుడు విక్ర‌మ్ ప్ర‌భు దేశీరాజు అనే కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ పాత్ర‌కు సంబంధించిన గ్లింప్స్ ను చిత్రం యూనిట్ నిన్న విక్ర‌మ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసింది. 

ఈ గ్లింప్స్ ను యాక్ష‌న్‌, బైక్ స్టంట్స్ తో ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. చివ‌ర‌లో అనుష్క కూడా బైక్ న‌డుపుతూ క‌నిపించారు. ఇక ఈ చిత్రంలో అనుష్క పాత్ర కూడా చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఇప్పటికే విడుద‌లైన‌ ఈ మూవీ టీజర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. 

ఈ సినిమాకు నాగవెల్లి విద్యా సాగర్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 'ఘాటి' మూవీ ఏప్రిల్ 18న తెలుగుతో పాటు త‌మిళ, మ‌ల‌యాళ, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల కానుంది.  

More Telugu News