Top-25 Global Banks: టాప్-25 గ్లోబల్ బ్యాంకుల జాబితాలో మూడు భారత బ్యాంకులు

Three Indian banks in Top25 Global banks

  • టాప్-25 గ్లోబల్ బ్యాంకుల జాబితా విడుదల చేసిన గ్లోబల్ డేటా సంస్థ
  • హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, ఎస్ బీఐ బ్యాంకులకు స్థానం
  • మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా జాబితా 

భారతీయ బ్యాంకులు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ), ఐసీఐసీఐ బ్యాంకు టాప్-25 గ్లోబల్ బ్యాంకుల జాబితాలో చోటు సంపాదించాయి. 2024 సంవత్సరంలో నాలుగో త్రైమాసికం ఫలితాల ఆధారంగా ఈ మూడు భారత బ్యాంకులకు గ్లోబల్ జాబితాలో స్థానం లభించింది. 

అంతర్జాతీయ డేటా ఎనలిటిక్స్, రీసెర్చ్ సంస్థ గ్లోబల్ డేటా రూపొందించిన ఈ లిస్టులో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 13వ స్థానంలో, ఐసీఐసీఐ బ్యాంకు 19వ స్థానంలో, ఎస్ బీఐ 24వ స్థానంలో ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ప్రాతిపదికన ఈ జాబితా రూపొందించారు. 

గతేడాది నాలుగో త్రైమాసికంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ 158.5 బిలియన్ డాలర్లు కాగా, ఐసీఐసీఐ బ్యాంకు 105.7 బిలియన్ డాలర్లు, ఎస్ బీఐ 82.9 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నమోదు చేశాయి. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ లో 1.6 శాతం పెరుగుదల నమోదైంది. 

2023 సంవత్సరంలో నాలుగో త్రైమాసికంతో పోల్చితే 2024 సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో గ్లోబల్ టాప్-25 బ్యాంకుల మార్కెట్ క్యాపిటలైజేషన్ 27.1 శాతం పెరిగి 4.6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.

More Telugu News