RS Praveen Kumar: కౌశిక్ రెడ్డి కోసం బరాబర్ పోరాటం చేస్తాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar says will fight for RSP

  • కౌశిక్ రెడ్డి అరెస్ట్ తర్వాత తమను హౌస్ అరెస్ట్ చేశారని ఆగ్రహం
  • పండుగ రోజున తమ అపార్ట్‌మెంట్ ముందు పోలీసులు మోహరించారని ఆగ్రహం
  • నాకు సొంతిల్లు లేదు... ఓ ఇంటిని ఇవ్వాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తమ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారని, ఈ సందర్భంగా తమను హౌస్ అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తమను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని తాము పోలీసులను అడిగితే... కౌశిక్ రెడ్డి కోసం మీరు బయటకు వచ్చి ఆందోళన చేస్తారని ఉన్నతాధికారులకు సమాచారం ఉందని తమతో చెప్పారని వెల్లడించారు. అవును.. కౌశిక్ రెడ్డి కోసం బరాబర్ (తప్పకుండా) పోరాటం చేస్తాం... అది తమ బాధ్యత అన్నారు.

ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పొద్దున్నే తమను హౌస్ అరెస్ట్ చేశారని, సంక్రాంతి పండుగ రోజున రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ అపార్ట్‌మెంట్ ముందు పోలీసులను మోహరించడం విడ్డూరమన్నారు. తాము ఆందోళనలు చేస్తాం తప్ప... కాంగ్రెస్ గూండాల్లా విధ్వంసం సృష్టించబోమన్నారు. అది తమ సంస్కృతి కాదన్నారు. తమను ఇప్పటికి ఎన్నోసార్లు గృహనిర్బంధం చేశారని ఆరోపించారు.

హైదరాబాద్‌లో తనకు సొంత ఇల్లు లేదని, ఓ చిన్న ఆపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నానని తెలిపారు. ప్రతిసారి తమ ఇంటికి పోలీసులు వచ్చి హడావుడి చేయడం వల్ల కాంప్లెక్స్‌లోని మిగతా కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని తెలిపారు. వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు చెప్పారు. వారు తనపై తీవ్ర సానుభూతి చూపిస్తున్నారని, అదే సమయంలో రేవంత్ రెడ్డి పాలనపై ఆగ్రహంతో ఉన్నట్లు చెప్పారు. తనను అంతలా నిర్బంధించాలనుకుంటే తనకు ఓ ఇంటిని ఇవ్వాలని చురక అంటించారు. కానీ ప్రభుత్వంపై పోరాటం ఆగదన్నారు.

  • Loading...

More Telugu News