Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీస్ స్టేషన్‌లో వైద్య పరీక్షలు

health checkup to padi kaushik reddy

  • ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో వైద్య పరీక్షలు
  • నేడు న్యాయమూర్తి ముందు హజరుపర్చే అవకాశం
  • నిన్న హైదరాబాద్‌లో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించిన పోలీసులు

బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని నిన్న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు (మంగళవారం) ఉదయం కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. దీంతో ఆయన్ను నేడు న్యాయమూర్తి ముందు హాజరుపర్చే అవకాశం ఉంది. 
 
కరీంనగర్ కలెక్టరేట్‌లో ఆదివారం మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో సమావేశం రసాభాసగా మారింది. ఈ పరిణామాలపై ఫిర్యాదులు చేయడంతో కౌశిక్ రెడ్డిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. 

నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు కావడంతో సోమవారం సాయంత్రం ఆయన్ను హైదరాబాద్‌లో‌ అరెస్టు చేసిన పోలీసులు కరీంనగర్‌కు తరలించారు.    

More Telugu News