Supreme Court: అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
- అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్న ఐదుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
- దేవస్థాన మండపంలో సత్యవ్రతం ఆచరించిన న్యాయమూర్తులు
- న్యాయమూర్తులకు స్వామి వారి చిత్రపటాలు, ప్రసాదాలు అందజేసిన ఆలయ ఈవో
అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సత్యదేవుడి మండపంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి, జస్టిస్ కేవి విశ్వనాథన్, జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ సంజయ్ కుమార్ సోమవారం కుటుంబ సమేతంగా అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్నారు.
ముందుగా వీరికి దేవస్థానం అతిథిగృహం వద్ద జిల్లా సెషన్స్ న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా అదనపు న్యాయమూర్తి పి కమలాదేవి, తుని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె బాలకోటేశ్వరరావు, ఆర్డీవో శ్రీరమణి, డీఎస్పీ శ్రీహరిరాజు, ఈవో సుబ్బారావు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయంలో వ్రతం అనంతరం వారికి వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఈవో వారికి స్వామి వారి చిత్రపటాలు, ప్రసాదాలు అందజేశారు.
.