daaku maharaj: డాకు మహారాజ్ లో చిన్నారి... ఎవరీ వేద అగర్వాల్?
- డాకు మహారాజ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బాలనటి వేద అగర్వాల్
- ఇప్పటికే 'గాండీవధారి అర్జున'లో నటించిన వేద
- గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'జాట్'లోనూ నటిస్తున్న వేద
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'డాకు మహారాజ్'. సంక్రాంతి కానుకగా ఆదివారం థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకుంది. ఈ మూవీలో వైష్ణవిగా నటించిన చిన్నారి నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ చిన్నారి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.
తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న చిన్నారి పేరు వేద అగర్వాల్. ఈ చిన్నారి యాక్టరే కాదు, సింగర్ కూడా. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. 31వేల మందికి పైగా ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంది. ఈ చిన్నారి కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందింది. అయితే వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది.
ఎనిమిదేళ్ల ఈ వేద అగర్వాల్ ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'గాండీవధారి అర్జున'లో చిన్న పాత్ర చేసింది. గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'జాట్'లోనూ నటిస్తోంది.