Chandrababu: గవర్నర్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు

- ప్రస్తుతం నారావారిపల్లెలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫోన్
- నేడు తన నివాసం వద్ద అర్జీలు స్వీకరించిన సీఎం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి సంబరాల కోసం స్వగ్రామం నారావారిపల్లెలో ఉన్న చంద్రబాబు ఇవాళ గవర్నర్ కు ఫోన్ చేశారు. విషెస్ తెలియజేయడంతో పాటు పలు అంశాలపై మాట్లాడారు.
కాగా, నారావారిపల్లెలో నేడు చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, తన నివాసం వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.



