KTR: ఇలాంటి చిల్లర చేష్టలతో బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు: కేటీఆర్

KTR condemns Kaushik Reddy arrest

  • నిన్న కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య ఘర్షణ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే
  • కేసు నమోదు చేసుకున్న కరీంనగర్ పోలీసులు
  • నేడు హైదరాబాదులో పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
  • కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమంటూ కేటీఆర్ విమర్శలు

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమని పేర్కొన్నారు. అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి సర్కారుకు అలవాటుగా మారిందని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనుకేసుకొచ్చి, కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని కేటీఆర్ పేర్కొన్నారు. 

పోరాటాలే ఊపిరిగా పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని ఇలాంటి చిల్లర చేష్టలతో దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

నిన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ లో మంత్రుల సమీక్షలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ఘర్షణ పడడం తెలిసిందే. సంజయ్ ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న కరీంనగర్ పోలీసులు నేడు పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాదులో అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News