Actress: దర్శకుడు త్రినాథరావు వ్యాఖ్యలపై స్పందించిన నటి అన్షు

- త్రినాథరావు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయన్న నటి
- ఆయన ఎంత మంచివారో చెప్పడానికే ఈ వీడియో అన్న అన్షు
- తనను కుటుంబ సభ్యురాలిగా గౌరవిస్తాడని వ్యాఖ్య
ప్రముఖ దర్శకుడు త్రినాథరావు తనపై చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడంపై సినీ నటి అన్షు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా అమె స్పందించారు. త్రినాథరావు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగిందని, ఆయన ఎంత మంచివారో చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నానన్నారు.
త్రినాథరావు ఎంతో స్నేహంగా ఉంటారని తెలిపారు. తనను కుటుంబ సభ్యురాలిగా భావించారని పేర్కొన్నారు. ఆయనను తాను ఎంతగానే గౌరవిస్తానన్నారు. టాలీవుడ్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్‌కు ఇంతకంటే మంచి దర్శకుడు దొరకకపోవచ్చేమో అని వ్యాఖ్యానించారు.
కాగా, సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో వస్తోన్న సినిమా మజాకా. ఈ సినిమాలో అన్షు కీలక పాత్ర పోషిస్తున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అన్షు శరీరాకృతి గురించి దర్శకుడు త్రినాథరావు మాట్లాడటం చర్చనీయాంశమైంది. దీంతో ఆయన ఈ రోజు క్షమాపణలు చెబుతూ వీడియోను విడుదల చేశారు.