Sankranti Celebrations: కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు... ప్రధాని మోదీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన చిరంజీవి

Modi and Chiranjeevi kicks off Sankranti celebrations in Kishan Reddy residence

  • ఢిల్లీలో సంక్రాంతి సంబరాలు
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సందడి
  • ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ... ప్రత్యేక అతిథిగా చిరంజీవి

ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఈ సాయంత్రం సంక్రాంతి వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా, చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. ఈ సంబరాలకు కేంద్రమంత్రులు, పీవీ సింధు, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి వంటి వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా, ప్రధాని మోదీతో కలిసి చిరంజీవి జ్యోతి ప్రజ్వలన చేశారు. కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. ఇక, సంక్రాంతి వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ గాయని సునీత తన పాటలతో అందరినీ అలరించారు.

More Telugu News