IPS Transfers: ఏపీలో ఐపీఎస్ ల బదిలీలు
- ఐదుగురు ఐపీఎస్ లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
- ప్రస్తుతం గ్రేహౌండ్స్ అస్సాల్ట్ కమాండర్లుగా పని చేస్తున్న ఐపీఎస్ లు
- తక్షణమే అమల్లోకి రానున్న ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఐదుగురు ఐపీఎస్ లు ప్రస్తుతం గ్రేహౌండ్స్ లో అస్సాల్ట్ కమాండర్లుగా పని చేస్తున్నారు.
బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు వీరే:
- 2021 బ్యాచ్ కు చెందిన నవజ్యోతి మిశ్రా - చింతపల్లి ఏఎస్పీగా బదిలీ
- 2022 బ్యాచ్ కు చెందిన మందా జావళి ఆల్ఫోన్స్ - నంద్యాల ఏఎస్పీగా బదిలీ
- 2022 బ్యాచ్ కు చెందిన మనోజ్ రామ్ నాథ్ హెగ్డే - రాజంపేట ఏఎస్పీగా బదిలీ
- 2022 బ్యాచ్ కు చెందిన దేవరాజ్ మనీశ్ - కాకినాడ ఏఎస్పీగా బదిలీ
- 2022 బ్యాచ్ కు చెందిన రోహిత్ కుమార్ చౌదరి - తాడిపత్రి ఏఎస్పీగా బదిలీ.
ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరిట ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.