Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
- అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల ప్రభావం
- 1,048 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 345 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నేపథ్యంలో ఈ ఉదయం మన మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ముగిసేంత వరకు సూచీలు భారీ నష్టాల్లోనే పయనించాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,048 పాయింట్లు దిగజారి 76,330కి పడిపోయింది. నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోయి 23,085 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (0.78%), టీసీఎస్ (0.62%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.45%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.41%).
టాప్ లూజర్స్:
జొమాటో (-6.52%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-4.09%), అదానీ పోర్ట్స్ (-4.08%), టాటా స్టీల్ (-3.49%), ఎన్టీపీసీ (-3.23%).