Jr NTR: 'దావుది' పాటకు పిల్లల డ్యాన్స్... ఎన్‌టీఆర్ ఫిదా

దేవర సినిమాలోని దావుది పాటకు కొందరు స్కూల్ విద్యార్థులు డ్యాన్స్ చేశారు. అందులో ఓ బాలుడు స్టైలిష్ స్టెప్పులతో హీరో తారక్‌ను అనుకరిస్తూ అదరగొట్టాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో ఎన్‌టీఆర్ స్పందించారు. మీ డ్యాన్స్ చాలా అందంగా ఉంది అంటూ కామెంట్ చేశారు. ఇదిలాఉంటే... ఈ వీడియోకు సోషల్ మీడియాలో 15.9 మిలియన్ వ్యూస్, 23 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం.
ఇటీవల 'దేవర' సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న తారక్.. ప్రశాంత్ నీల్‌తో మూవీ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. అలాగే ఎన్‌టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న 'వార్-2' చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.