Seethakka: మనం తప్పు చేస్తూ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దు: మంత్రి సీతక్క

- రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలన్న సీతక్క
- బైక్‌పై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వెల్లడి
- ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్న మంత్రి
ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మనం తప్పు చేస్తూ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు. ఈరోజు ఆమె ఆసిఫాబాద్ లో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలంటే అందరూ రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. బైక్‌పై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.
పార్టీలకు వేలాది రూపాయలు ఖర్చు చేసే మనం హెల్మెట్ కోసం వెయ్యి రూపాయలు ఖర్చు చేయకపోవడం బాధాకరమన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
కాగా, మంత్రి సీతక్క ఆ తర్వాత ఆసిఫాబాద్ జిల్లాలోని జంకాపూర్‌లో మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అంగన్వాడీ చిన్నారులకు రంగురంగుల యూనిఫాంలు పంపిణీ చేసి, బాలామృతం తినిపించారు.