Pawan Kalyan: తెలుగు ప్ర‌జ‌ల‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సంక్రాంతి శుభాకాంక్ష‌లు

AP Deputy CM Pawan Kalyan Greeted Ssankranti

  • పండ‌గ సందడితో తెలుగు రాష్ట్రాల ప‌ల్లెలు శోభాయ‌మ‌నం అన్న ప‌వ‌న్‌
  • భార‌తీయులంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు అంటూ లేఖ విడుద‌ల చేసిన జ‌న‌సేనాని
  • ఈ పండుగ‌వేళ ప‌ల్లెలు పిల్లాపాప‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటే సంతోషంగా ఉందని వ్యాఖ్య‌

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలుగు ప్ర‌జ‌ల‌కు భోగి, సంక్రాంతి, క‌నుమ‌ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక లేఖ‌ను పోస్ట్ చేశారు. 

"రంగ‌వ‌ల్లులు.. గొబ్బెమ్మ‌లు.. గంగిరెద్దులు.. హ‌రిదాసులు.. భోగిమంట‌లు.. పిండివంట‌ల స‌మ్మేళ‌న‌మే సంక్రాంతి. అటువంటి స‌ర‌దాల కోసం న‌గ‌రాల‌న్నీ ప‌ల్లెలవైపు ప‌రుగులు తీశాయి. 

ఇది ప్ర‌జ‌ల‌కు పండుగ‌పై ఉన్న మ‌క్కువ‌ను తెలియ‌జేస్తుంది. ఉపాధి కోసం ప‌ల్లె బిడ్డ‌లు న‌గ‌రాల‌కు వ‌ల‌స‌పోవ‌డంతో గ్రామాలు జ‌నాలు లేక ప‌లుచ‌బ‌డ్డాయి. ఈ సంక్రాంతి పండుగ‌వేళ ప‌ల్లెలు పిల్లాపాప‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటే సంతోషంగా ఉంది. ప‌ల్లె సౌభాగ్య‌మే... దేశ సౌభాగ్యం. ఆనందాలు, సిరి సంప‌ద‌ల‌తో ప‌ల్లెలు శుభిక్షంగా శోభిల్లాల‌ని, తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు సుఖ‌సంతోషాల‌తో విరాజిల్లాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని జ‌న‌సేనాని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News