Narendra Modi: జమ్మూకశ్మీర్‌లో జడ్ మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi inaugurates Z Morh tunnel in JK Sonamarg

  • టన్నెల్ లోపలకు వెళ్లి పరిశీలించిన ప్రధాని మోదీ
  • కార్యక్రమంలో పాల్గొన్న లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, గడ్కరీ
  • రూ.2,700 కోట్లతో జడ్ మోడ్ సొరంగం నిర్మాణం

ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు జమ్మూకశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లాలోని జడ్ మోడ్ సొరంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. 

శ్రీనగర్ -లేహ్ జాతీయ రహదారిపై సోన్ మార్గ్ ప్రాంతంలో రూ.2,700 కోట్లతో ఈ జడ్ మోడ్ సొరంగాన్ని నిర్మించారు. కొండచరియలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో ఈ టన్నెల్‌ను నిర్మించారు. ఇది సముద్రమట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సొరంగం ఆరున్నర కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 2015లో ప్రారంభమైన దీని నిర్మాణ పనులు గత ఏడాది పూర్తయ్యాయి.

  • Loading...

More Telugu News