Infosys: ఉద్యోగులకు వేతనాల పెంపుపై త్వరలో ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్?
- ఫిబ్రవరిలో వేతనాల పెంపును ప్రకటించే అవకాశం
- జనవరి నుంచి అమల్లోకి వేతనాల పెంపు!
- తొలుత జాబ్ లెవల్ 5 ఉద్యోగులకు, ఆ తర్వాత మిగతా వారికి పెంపు అవకాశం
ఉద్యోగులకు ఇన్ఫోసిస్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఫిబ్రవరిలో వేతనాల పెంపును ప్రకటించే అవకాశముందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వేతనాల పెంపును ఫిబ్రవరి నుంచి క్రమంగా అమలు చేయనుందని తెలుస్తోంది. వేతనాల పెంపు సమాచారం మొదట జాబ్ లెవల్ 5లోని ఉద్యోగులకు అందుతుందని తెలుస్తోంది. వీరికి ఫిబ్రవరిలో సంబంధిత లెటర్స్ అందించనున్నారు.
జనవరి 1 నుంచే వేతనాల పెంపు అమల్లోకి వస్తుందని ఇంగ్లీష్ మీడియా కథనాల సారాంశం. జేఎల్5లో సాఫ్టువేర్ ఇంజినీర్లు, సీనియర్ ఇంజినీర్లు, సిస్టం ఇంజినీర్లు, కన్సల్టెంట్లు ఉంటారు. జాబ్ లెవల్ 6 ఆపై ఉన్న వారికి మార్చిలో వేతనాల పెంపుకు సంబంధించిన లేఖలు అందనున్నాయని తెలుస్తోంది. అయితే వేతనాల పెంపుకు సంబంధించి కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.