Daaku Maharaaj: 'డాకు మహారాజ్' సక్సెస్ పార్టీలో ఊర్వశి రౌతేలాతో బాలయ్య స్టెప్పులు అదుర్స్.. వీడియో వైరల్!

- 'డాకు మహారాజ్' సినిమాకు పాజిటివ్ టాక్
- దీంతో ఆదివారం రాత్రి సక్సెస్ పార్టీ నిర్వహించిన మేకర్స్
- ఈ పార్టీకి బాలయ్యతో పాటు దర్శకుడు, నిర్మాత, హీరోయిన్లు, పలువురు హీరోలు హాజరు
- దబిడి దిబిడి పాటకు ఊర్వశితో డ్యాన్స్ చేస్తూ హూషారెత్తించిన బాలకృష్ణ
- ఇన్‌స్టా ద్వారా వీడియోను షేర్ చేసిన ఊర్వశి రౌతేలా
టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం గత రాత్రి సక్సెస్ పార్టీ నిర్వహించింది.
హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ పార్టీకి బాలయ్యతో పాటు దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, పలువురు హీరోలు హాజరై సందడి చేశారు.
ఈ సక్సెస్ పార్టీలో బాలకృష్ణతో పాటు యంగ్ హీరోలు విష్వక్సేన్, సిద్ధూ జొన్నలగడ్డ హంగామా చేశారు. సిద్ధూ, విష్వక్సేన్ చెంపలపై బాలయ్య ముద్దులు పెట్టారు. వారు కూడా బాలకృష్ణపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఇక ఊర్వశి రౌతేలాతో బాలయ్య మళ్లీ స్టెప్పులేశారు. 'దబిడి దిబిడి' పాటకు ఊర్వశితో డ్యాన్స్ చేస్తూ హూషారెత్తించారు. బాలయ్య స్టెప్పులేస్తూ ఆమె దగ్గరకు వెళ్లడం వీడియోలో ఉంది. ఈ వీడియోను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. దీనిపై నందమూరి ఫ్యాన్స్ తమదైనశైలిలో స్పందిస్తున్నారు.