Flipkart: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం.. భారీ డిస్కౌంట్ ఆఫర్లు

Flipkart has kicked off its first major sale of 2025 with the Republic Day Sale

  • ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ మెంబర్స్‌కు మొదలైన సేల్
  • రేపటి నుంచి సాధారణ కస్టమర్లకు అందుబాటులోకి రాానున్న విక్రయాలు
  • స్మార్ట్‌ఫోన్ల నుంచి ఫ్యాషన్ ఉత్పత్తుల వరకు అందుబాటులో భారీ డిస్కౌంట్లు

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందించే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘రిపబ్లిక్ డే సేల్‌ 2025’ను ప్రారంభించింది. జనవరి 14న (మంగళవారం) ప్రారంభమై 6 రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్... ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ మెంబర్స్‌కు ఇవాళ్టి (సోమవారం) నుంచే అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, దుస్తులు, బ్యూటీ ప్రొడక్టులతో పాటు అనేక రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, వీఐపీ మెంబర్స్‌కు 24 గంటల ముందే భారీ డిస్కౌంట్ డీల్స్ ఆకట్టుకుంటున్నాయి.

స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్
స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాలనుకుంటున్న వినియోగదారులు ‘ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్‌-2025’లో భాగంగా భారీ తగ్గింపు ఆఫర్లపై ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. పలు రకాల స్మార్ట్‌ఫోన్లపై 50 శాతం వరకు డిస్కౌంట్లు పొందవచ్చు. యాపిల్, సామ్‌సంగ్, మోటరోలా, నథింక్, విడో, రియల్‌మీ, ఒప్పో వంటి ప్రముఖ బ్రాండ్ల ఫోన్లపై కూడా డిస్కౌంట్ డీల్స్ దక్కించుకోవచ్చు. స్మార్ట్ టీవీలపై కూడా భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్ ప్రొడక్ట్స్, స్పోర్ట్స్, మేకప్ వస్తువులపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉంటాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News