China: భారత సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాలు

China conducts drills near LAC in Eastern Ladakh

  • యుద్ధ సన్నద్దతను పరీక్షించిన చైనా మిలటరీ
  • సరుకుల రవాణాకు సంబంధించి ప్రయోగాత్మక పరీక్షలు
  • లడఖ్ సమీపంలో దాయాది దేశం విన్యాసాలపై భారత బలగాల అప్రమత్తం

సరిహద్దుల్లో చైనా తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. టిబెట్ లోని అత్యంత ఎత్తైన ప్రాంతంలో చైనా సైనిక విన్యాసాలు చేపట్టింది. యుద్ధ సన్నద్ధత, సరుకు రవాణాలకు సంబంధించి విన్యాసాలు చేపట్టింది. అత్యంత ఎత్తైన ప్రాంతంలో అవసరమైన సరుకులను వేగంగా చేర్చేందుకు సైనికులు ప్రాక్టీస్ చేస్తున్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఈ విన్యాసాలు చేపట్టడం, అదికూడా ఇండియన్ ఆర్మీ ఫౌండేషన్ డే ముందు నిర్వహించడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. చైనా బలగాల కదలికలపై అత్యాధునిక నిఘా వ్యవస్థలు, ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్ల సాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

చైనా సైనిక విన్యాసాల్లో భాగంగా ఎత్తైన ప్రదేశాలకు లాజిస్టిక్ రవాణా కోసం సైనికులు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. డ్రోన్లతో సరుకులను, ఆయుధాలను ఎత్తైన ప్రాంతాలకు చేర్చడం, వాహనాలను తరలించడం చేస్తున్నారు. షింజియాంగ్‌ మిలటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంట్‌ ఈ ప్రాక్టీస్ చేపట్టింది. భారత సరిహద్దుల్లోని లడఖ్ సమీపంలో వాతావరణం అత్యంత చల్లగా ఉంటుంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలలో చైనా సైనికులు ప్రాక్టీస్ చేస్తుండడం గమనార్హం. శీతల వాతావరణాన్ని తట్టుకునేందుకు చైనా బలగాలు ఎక్సోస్కెలిటెన్లు ఉపయోగిస్తున్నారు.

More Telugu News