Sonia Gandhi: 15వ తేదీన ఇందిరాభవన్ ను ప్రారంభించనున్న సోనియాగాంధీ

Sonia Gandhi to inaugurate new party office on Jan 15

  • ఢిల్లీ కోట్ల రోడ్ లో కాంగ్రెస్ పార్టీ కొత్త జాతీయ ప్రధాన కార్యాలయం
  • అక్బర్ రోడ్ నుంచి కోట్ల రోడ్ కు మారనున్న ప్రధాన కార్యాలయం అడ్రస్
  • ప్రారంభోత్సవ కార్యక్రమానికి 400 మందికి ఆహ్వానాలు

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయం అడ్రస్ మారబోతోంది. ఓల్డ్ గ్రాండ్ పార్టీ కాంగ్రెస్ నూతన జాతీయ కార్యాలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ కార్యాలయాన్ని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఈ నెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యమానికి రాహుల్ గాంధీ, ప్రియాకాగాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా హాజరవుతారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత జాతీయ కార్యాలయం అక్బర్ రోడ్ లో ఉంది. కొత్త కార్యాలయాన్ని కోట్ల రోడ్ లో నిర్మించారు. ఈ క్రమంలో పార్టీ అడ్రస్ అక్బర్ రోడ్ నుంచి కోట్ల రోడ్ కు మారనుంది.

కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 400 మందికి ఆహ్వానాలు అందాయి. వీరిలో సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతలు, ఏఐసీసీ కార్యదర్శులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఉన్నారు.

More Telugu News