Viral News: వేరే ఖాతాల్లోకి క్యూఆర్ కోడ్‌‌ పేమెంట్లు.. సీసీ కెమెరా పరిశీలనలో బయటపడ్డ అసలు నిజం

fraudsters changing the online payment scanners overnight in Madhya Pradeshs Khajuraho

  • రాత్రికి రాత్రే క్యూఆర్ కోడ్ స్కానర్లను మార్చివేసిన మోసగాళ్ల ముఠా
  • పేమెంట్లు కేటుగాళ్ల ఖాతాల్లో పడినట్టు గుర్తింపు
  • దుండగులను గుర్తించి పట్టుకుంటామన్న పోలీసులు

షాప్‌కు వెళ్లిన కస్టమర్లు సరుకులు కొన్న తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్లు చేశారు. కానీ, డబ్బులు మాత్రం షాప్ యజమాని అకౌంట్‌లో పడడం లేదు. కస్టమర్లు అందరికీ ఇదే పరిస్థితి ఎదురైంది. దాదాపు ఆరు వ్యాపార సముదాయాల్లో ఇదే పరిస్థితి ఉత్పన్నమైంది. అనుమానం వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు నిజం వెలుగుచూసింది.

మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో కొన్ని వ్యాపార సంస్థల క్యూఆర్‌ కోడ్ స్కానర్లను ఓ ముఠా రాత్రికి రాత్రే మార్చివేసింది. దుకాణదారుల స్కానర్లపై వారి క్యూఆర్ కోడ్‌లను అతికించారు. దీంతో, కస్టమర్లు చెల్లించిన డబ్బులు ఆ దొంగల ముఠా ఖాతాల్లోకి వెళ్లాయి. రాత్రి సమయంలో స్కానర్‌లను మార్చుతున్నట్టుగా సీసీ కెమెరా ఫుటేజీల్లో కనిపించింది. దాదాపు ఆరు వ్యాపార సముదాయాలను లక్ష్యంగా చేసుకున్నారు. దుండగులను గుర్తించాల్సి ఉందని ఖజురహో పోలీసులు తెలిపారు.

ఆదివారం ఉదయం ఒక కస్టమర్ తన దుకాణంలో క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేశారని, అయితే, స్కానర్‌తో అనుసంధానించిన బ్యాంక్ అకౌంట్‌ వేరొకరిది ఉన్నట్టు కస్టమర్ గుర్తించి అప్రమత్తం చేశారని రాజేష్ మెడికల్ స్టోర్స్ యజమాని గుప్తా చెప్పారు. ఓ పెట్రోల్ బంక్‌లో స్కానర్లను కూడా దుండగులు మార్చివేశారు. చాలా మంది కస్టమర్లు పేమెంట్ చేసినప్పటికీ అవి తమ ఖాతాలో పడలేదని ఓ ఉద్యోగి తెలిపారు. స్కానర్‌ పరిశీలించి చూడగా వేరేది అతికించి ఉందని చెప్పాడు.

క్యూఆర్ కోడ్ మోసం తమ దృష్టికి వచ్చిందని, అయితే వ్యాపారులెవరూ ఇంకా ఫిర్యాదు చేయలేదని ఖజురహో పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అతుల్ దీక్షిత్ తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని, మోసగాళ్లను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News