Type 2 Diabetes: క్యారట్లతో డయాబెటిస్‌కు చెక్.. తాజా అధ్యయనంలో వెల్లడి

మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇది శుభవార్తే. టైప్-2 డయాబెటిస్‌కు క్యారట్లతో చెక్ పెట్టవచ్చని సదరన్ డెన్మార్క్ యూనివర్సిటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోజూ క్యారట్లను తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయులను అదుపులో పెట్టుకోవచ్చని పరిశోధకులు గుర్తించారు.
బ్లడ్ సుగర్ స్థాయులను నియంత్రించడంతోపాటు పేగుల్లోని బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచేందుకు, శరీరాన్ని సమతుల్యంగా ఉంచేందుకు అవసరమయ్యే శక్తిని క్యారట్లు విడుదల చేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. డయాబెటిస్‌కు క్యారట్లు సహజ సిద్ధమైన, దుష్ఫలితాలు లేని చికిత్సగా ఉపయోగపడతాయని తెలిపారు. ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్టు వివరించారు. క్యారట్ పొడి తిన్న ఎలుకలు మధుమేహాన్ని సమర్థంగా నియంత్రించుకోగలిగినట్లు అధ్యయనకారులు తెలిపారు.