Kachidi Fish: అచ్యుతాపురంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేపలు.. రూ. 1.4 లక్షలకు వ్యాపారి కొనుగోలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో వేటకు వెళ్లిన మత్స్యకారుల పంట పడింది. వారి వలలో పడిన రెండు కచిడి చేపలకు లక్ష రూపాయలకు పైగా ధర పలికింది. అత్యంత రుచిగా ఉండటంతోపాటు ఔషధ గుణాలు కూడా కలిగిన ఈ చేపలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఇవి పులస చేపల్లానే అత్యంత రుచికరంగా ఉండటంతోపాటు అదనంగా వీటిలో ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టే ఇవి పులస కంటే ఎక్కువ ధర పలుకుతాయి.
విషయం తెలిసిన వ్యాపారులు ఆ రెండు చేపలను కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. చివరికి పూడిమడకకు చెందిన ఓ వ్యాపారి రూ. 1.4 లక్షలకు కొనుగోలు చేశారు. వీటిని కోల్‌కతాకు ఎగుమతి చేయనున్నట్టు చెప్పారు. ఈ చేపలు బంగారు వర్ణంలో ఉండటంతో వీటిని గోల్డెన్ పిష్ అని కూడా పిలుస్తారని మత్స్యకారులు తెలిపారు.