Super Star krishna: సూపర్ స్టార్ కృష్ణ విలువలతో జీవితాన్ని గడిపారు: మంత్రి నాదెండ్ల
- తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్
- సినీ ఇండస్ట్రీకి టెక్నాలజీని పరిచయం చేసి అనేక విజయాలను కృష్ణ సాధించారన్న మనోహర్
- చిత్ర సీమ ఉన్నంత వరకూ ప్రజల గుండెల్లో కృష్ణ ఉంటారన్న మాజీ మంత్రి ఆలపాటి
సూపర్ స్టార్ కృష్ణ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆదివారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సినీ నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావులతో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీకి టెక్నాలజీని పరిచయం చేసి ఎన్నో విజయాలను సాధించారని గుర్తు చేశారు. తెనాలిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చిత్రసీమ ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో కృష్ణ చిరస్థాయిగా ఉంటారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు.