Jagan: తాడేపల్లిలో జగన్ ఇంటి వెనుక టీడీపీ నేత ఏర్పాటు చేసిన బెంచీ ధ్వంసం

YCP Leaders Arrested For Vandalise Bench At Jagan House

  • ప్రయాణికులు కూర్చునేందుకు ఐదు బెంచీలు ఏర్పాటు చేసిన టీడీపీ నేత గొర్ల వేణుగోపాల్‌రెడ్డి
  • గోశాల ఎదురుగా ఏర్పాటు చేసిన బెంచీని కిందపడేసిన వైసీపీ నేతలు
  • పోలీసులు సరిచేసి వెళ్లిన కాసేపటికే ధ్వంసం చేసిన వైనం
  • మేకా అంజిరెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి అరెస్ట్ 

ఏపీ రాజధాని ప్రాంతం తాడేపల్లిలోని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇంటి వెనుక ఏర్పాటు చేసిన బెంచీని వైసీపీ నాయకులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులు కూర్చునేందుకు స్థానిక టీడీపీ నేత గొర్ల వేణుగోపాల్‌రెడ్డి శనివారం రాత్రి ఐదు బెంచీలు ఏర్పాటు చేశారు.

వీటిలో గోశాల ఎదురుగా ఏర్పాటు చేసిన బెంచీని నిన్న ఉదయం వైసీపీ నేతలు మేకా అంజిరెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి కలిసి కిందపడేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో దానిని మళ్లీ సరిగా ఏర్పాటు చేశారు. అయితే, ఆ తర్వాత కాసేపటికే వారు దానిని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బెంచీని ధ్వంసం చేసినందుకు అంజిరెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News