Elephant: ఏనుగును రెచ్చగొట్టి... పరుగెత్తించి...!

Angry Elephant running viral video here

  • గుంపుగా వెళుతున్న ఏనుగుల్లో ఒకదానిని రెచ్చగొట్టిన యువకుడు
  • అతడి వెంటపడి పరుగెత్తి వదిలేసిన ఏనుగు
  • అయినా ఆ ఏనుగును రెచ్చగొట్టడం ఆపని యువకుడు

అక్కడో ఏనుగుల గుంపు వెళుతోంది. అందులో ఒక గున్న ఏనుగును ఓ యువకుడు కావాలని రెచ్చగొట్టాడు. దానికి దగ్గరగా వెళుతూ, చేతులు ఊపడం మొదలుపెట్టాడు. దీనితో చిరాకెత్తిన ఏనుగు అతడి వెంటపడింది. కొంత దూరం వెళ్లాక.. పోనీలే అన్నట్టుగా ఏనుగు వెనుదిరిగింది. అయినా ఆ యువకుడు ఊరుకోకుండా... మళ్లీ ఆ ఏనుగును రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. మళ్లీ అతడి వెంటపడేందుకు ప్రయత్నించిన ఏనుగు... వదిలేసి.. తన గుంపుతో కలసి వెళ్లిపోయింది. దీనికి సంబంధించి ప్రముఖ ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి పర్వీన్ కాశ్వాన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఇలాంటి తీరు సరికాదని పేర్కొన్నారు.

మనుషుల వెంటపడుతుంది...
‘‘అది గున్న ఏనుగు. వేగంగా పరుగెత్తలేదు. అతడు యువకుడు కాబట్టి వేగంగా పరుగెడుతూ ఆ ఏనుగును రెచ్చగొట్టాడు. కానీ ఈ తీరుతో చిరాకు చెందిన ఏనుగు ఊరికే ఉండదు. కొన్ని రోజుల పాటు అయినా సరే... మనుషులు కనిపిస్తే ఆగ్రహంతో వ్యవహరిస్తుంది. వెంటపడి ప్రమాదానికి కారణమైనా అవుతుంది. మీ సరదా కోసం అడవి జంతువులను ఇలా చిరాకు పెట్టవద్దు..’’ అని పర్వీన్ కాశ్వాన్ తన పోస్టులో స్పష్టం చేశారు.

వైరల్ గా మారిన వీడియో...
  • ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి పర్వీన్ కాశ్వాన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. కొన్ని గంటల్లోనే నాలుగు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.
  • ఈ వీడియోలో ఏనుగును రెచ్చగొట్టిన యువకుడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున ఆ ఏనుగు మరెవరిపై అయినా దాడి చేస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.
  • ఈ వీడియోలోని యువకుడిని గుర్తించి శిక్షించాలని, మరొకరు ఇలా వ్యవహరించకుండా చేయాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.

More Telugu News