minister ponguleti srinivas reddy: ప్రమాదం నుంచి తప్పించుకున్న మంత్రి పొంగులేటి

- ఒకేసారి పేలిన మంత్రి పొంగులేటి కారు టైర్లు
- పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం
- వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా, తిరుమలాయపాలెం వద్ద ఘటన
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో మంత్రికి పెను ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళితే.. మంత్రి పొంగులేటి ఆదివారం రాత్రి వరంగల్ నుంచి ఖమ్మం వెళ్తుండగా, తిరుమలాయపాలెం వద్ద ఒకేసారి రెండు టైర్లు పేలడంతో కారు అదుపుతప్పింది. అయితే కారు డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అనంతరం మంత్రి పొంగులేటి తన ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం చేరుకున్నారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో మంత్రి పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. ఘటన విషయం తెలియడంతో పొంగులేటి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పలువురు నేతలు పొంగులేటికి ఫోన్ చేసి పరామర్శించారు. ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.

