Chandrababu: నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... వీడియో ఇదిగో!

- సొంతూర్లో సంక్రాంతి జరుపుకోనున్న చంద్రబాబు
- ఇప్పటికే నారావారిపల్లె చేరుకున్న భువనేశ్వరి, లోకేశ్, తదితరులు
- గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు
సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లె చేరుకున్నారు. చంద్రబాబు కుటుంబం ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను సొంతూర్లోనే జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోంది. నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా సంక్రాంతి వేడుకల కోసం నారావారిపల్లె వస్తుండడం తెలిసిందే.
కాగా, చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి, ఇతర బంధువులు నిన్న మధ్యాహ్నమే నారావారిపల్లె చేరుకున్నారు. మంత్రి నారా లోకేశ్, నారా బ్రాహ్మణి, దేవాన్ష్ నేటి సాయంత్రం నారావారిపల్లెకు విచ్చేశారు.
కాగా, చంద్రబాబు నారవారిపల్లెలో మూడ్రోజుల పాటు గడపనున్నారు. ఇవాళ తన భారీ కాన్వాయ్ తో గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన సీఎం చంద్రబాబు గ్రామస్తుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పలువురు గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ తన నివాసానికి వెళ్లారు. చంద్రబాబు రాకతో ఊరంతా ఫ్లెక్సీలు, బ్యానర్ల మయం అయింది.
చంద్రబాబు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. రోడ్లు, సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.