Ajith: రేసులో 55వ స్థానం నుంచి 26వ స్థానానికి అజిత్ ఎలా దూసుకుపోయాడో వీడియో చూడండి!
- దుబాయ్ 24హెచ్ కార్ రేసింగ్ లో అజిత్ టీమ్ కు 3వ స్థానం
- వేగంగా కారు నడిపి ఔరా అనిపించిన అజిత్
- వీడియో వైరల్
దక్షిణాది సీనియర్ హీరో అజిత్ టీమ్ దుబాయ్ 24హెచ్ కార్ రేసింగ్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ సెషన్ లో కారుకు ప్రమాదం జరిగినప్పటికీ, ఏమాత్రం వెనుకంజ వేయకుండా, మెయిన్ రేసులో సత్తా చాటడం అజిత్ కే చెల్లింది.
ఇవాళ్టి రేసు ప్రారంభంలో అజిత్ కాస్త వెనుకబడ్డాడు. ప్రారంభ ల్యాప్ లలో అజిత్ 55వ పొజిషన్ లో ఉన్నప్పటికీ, స్వల్ప వ్యవధిలోనే దూసుకుపోయాడు. వేగంగా డ్రైవ్ చేస్తూ 26వ స్థానానికి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.