Steve Jobs: కాశీలో స్టీవ్ జాబ్స్ సతీమణి పూజలు

Steve Jobs Wife Laurene Powell Offers Prayers At Varanasi

  • మహా కుంభమేళాలో పాల్గొననున్న యాపిల్ కో ఫౌండర్ భార్య
  • భారతీయ సంప్రదాయ దుస్తుల్లో విశ్వేశ్వరుడి దర్శనం
  • స్వయంగా తోడ్కొని వెళ్లిన స్వామి కైలాశానంద్ గిరి జి మహారాజ్

త్రివేణి సంగమం ప్రయాగ్ రాజ్ లో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం ఆచరించేందుకు హిందువులతో పాటు విదేశీయులు కూడా వస్తున్నారు. యాపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్స్ పావెల్ కూడా మహా కుంభమేళాలో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. శనివారం కాశీ పుణ్యక్షేత్రం సందర్శించారు. పావెల్ ను నిరంజన్ అఖాడాకు చెందిన స్వామి కైలాశానంద్ గిరి జి మహారాజ్ ఆమెను వెంట తోడ్కొని వెళ్లి స్వామి వారి దర్శనం కల్పించారు. ప్రత్యేక పూజలు చేయించారు.

పావెల్ హిందూ సంప్రదాయం పాటిస్తారని, మహా కుంభమేళాలో పాల్గొనేందుకు భారత దేశం వచ్చారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా మహా కుంభమేళాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విగ్నంగా పూర్తయ్యేలా చూడాలంటూ కాశీ విశ్వనాథుడిని ప్రార్థించినట్లు స్వామి కైలాశానంద్ గిరి జి మహారాజ్ చెప్పారు. కాగా, సంప్రదాయ దుస్తుల్లో లారెన్స్ పావెల్ ఆలయ దర్శనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News