apple ceo: ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనం మరింత పెరిగింది!

- ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వార్షిక వేతనాన్ని 18 శాతం పెంచిన కంపెనీ
- కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ఆపిల్
- తన వార్షిక ప్రాక్సీ ఫైలింగ్‌లో వెల్లడించిన ఆపిల్
ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వార్షిక వేతనాన్ని 18 శాతం పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న జరగబోయే కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఆపిల్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 2023 లో టిమ్ కుక్ వేతనం 63.2 మిలియన్ డాలర్లు (రూ.544 కోట్లు) నుంచి 2024లో 74.6 మిలియన్ డాలర్ల (రూ.643 కోట్లు)కు పెరిగింది. ఈ మేరకు తన వార్షిక ప్రాక్సీ ఫైలింగ్‌లో ఆపిల్ వెల్లడించింది.
టిమ్ కుక్ కనీస వేతనం మూడు మిలియన్ల డాలర్లు కాగా, స్టాక్ అవార్డుల ద్వారా 58.1 మిలియన్ డాలర్లు, అదనపు పరిహారం రూపేణా 13.5 మిలియన్ డాలర్లు చెల్లిస్తారు. గతేడాది నుంచి టిమ్ కుక్ వార్షిక వేతనం గణనీయంగా పెరిగింది. అలానే 2025 లో టిమ్ కుక్ వేతన ప్యాకేజీలో ఎటువంటి మార్పులు ఉండబోవని ఆపిల్ స్పష్టం చేసింది.