Crime News: క్రీడాకారిణిపై 62 మంది ఐదేళ్లుగా అత్యాచారం!

- కేరళలో వెలుగు చూసిన దారుణం
- బాధితురాలు 13 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే ఆమెపై అకృత్యాలు
- కోచ్‌లు, తోటి ఆటగాళ్లు కూడా దారుణం
- 15 మంది అరెస్ట్.. 40 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
ఓ క్రీడాకారిణి (18)పై 62 మంది ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న దారుణ ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. మరో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాధితురాలు 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పొరుగింటి వ్యక్తి బలవంతంగా ఆమెను తన ఇంట్లోకి తీసుకెళ్లి పోర్న్ చిత్రాలు చూపించాడు. ఆపై స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాలిక పోటీల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు తోటి ఆటగాళ్లతోపాటు కోచ్‌లు కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ విషయాన్ని ఆమె ఎప్పుడూ తల్లిదండ్రులకు చెప్పలేదు. తండ్రి సెల్‌ఫోన్‌ను బాధిత యువతి వాడుకునేది. దీంతో ఆ ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారే ఆమెపై ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిసింది. కేరళ సమాఖ్య సొసైటీ వలంటీర్లు ఇటీవల క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లినప్పుడు ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.