BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు... సెకండ్ లిస్టు వదిలిన బీజేపీ

- 29 మందితో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ
- రెండో జాబితాతో కలిపి మొత్తం 58 మంది అభ్యర్ధుల ప్రకటన
- ఇటీవలే ఆప్ నుంచి బీజేపీలో చేరిన ప్రియాంక గౌతమ్‌కు కౌండ్లీ టికెట్ ఇచ్చిన అధిష్టానం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో 29 మంది అభ్యర్ధులను ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తాజాగా విడుదల చేసిన జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటి వరకూ 58 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది.
ఢిల్లీ మాజీ సీఎం మదన్ లాల్ ఖురానా తనయుడు హరీశ్ ఖురానా మోతీ నగర్ నుంచి బరిలో దిగనున్నారు. ఇటీవలే ఆప్ నుంచి బీజేపీలో చేరిన ప్రియాంక గౌతమ్ కౌండ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ ఢిల్లీ ఉపాధ్యక్షుడు కపిల్ మిశ్రా కరావల్ నగర్ నుంచి బరిలో దిగుతున్నారు.
కపిల్ మిశ్రా గతంలో ఆప్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. అయితే కొన్ని రాజకీయ కారణాలతో 2017లో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో మిశ్రా 2019లో బీజేపీలో చేరారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుండగా, 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఆప్ మాత్రం ఇప్పటికే మొత్తం అభ్యర్ధులను ప్రకటించగా, కాంగ్రెస్ కొంత మంది పేర్లను విడుదల చేసింది. బీజేపీ మరో 12 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.