Vande Bharat Rail: సంక్రాంతి వేళ రైల్వే కీలక నిర్ణయం.. విశాఖ-హైదరాబాద్ వందేభారత్ రైలుకు అదనంగా 8 బోగీలు!

Vande Bharat Rail To Added 8 Additional Coaches

     


విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య ప్రయాణించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20707/20708) బోగీలను పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం 8 కోచ్‌లతో రైలు ప్రయాణిస్తుండగా రేపటి నుంచి మరో 8 జోడిస్తున్నట్టు తెలిపింది. దీంతో మొత్తం కోచ్‌ల సంఖ్య 16కు పెరగనుంది. అలాగే, ప్రస్తుతం 530 సీట్లు మాత్రమే అందుబాటులో ఉండగా, రేపటి నుంచి 1,128 సీట్లు అందుబాటులోకి వస్తాయి.

నిరుడు మార్చిలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన ఈ రైలులో ఎగ్జిక్యూటివ్ కోచ్ 1, చైర్‌కార్‌లు 7 ఉన్నాయి. తాజా పెంపుతో ఎగ్జిక్యూటివ్ కోచ్‌ల సంఖ్య రెండుకు, చైర్‌కార్‌ల సంఖ్య 14 పెరుగుతుంది.

  • Loading...

More Telugu News