BJP: కేజ్రీవాల్! గెలిచేందుకు మాకు మా కమలం గుర్తు చాలు: బీజేపీ నేత

On BJP Chief Minister Face Arvind Kejriwal Big Claim

  • రమేశ్ బిధూరిని బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందేమోనని కేజ్రీవాల్ ఎద్దేవా
  • గెలుపు కోసం మాకు సీఎం అభ్యర్థి అవసరం లేదు... కమలం గుర్తు చాలన్న బీజేపీ నేత
  • కోర్టు నిబంధనల ప్రకారం కేజ్రీవాల్ సీఎం కాలేరన్న బీజేపీ నేత

ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలేమో... కానీ తమ పార్టీ విజయానికి కమలం గుర్తు చాలని బీజేపీ నేత ఆర్పీ సింగ్ అన్నారు. ఇటీవల ఢిల్లీ సీఎం అతిశీపై బీజేపీ నేత రమేశ్ బిధూరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ... రమేశ్ బిధూరిని బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందేమోనని ఎద్దేవా చేశారు.

ఈ వ్యాఖ్యలపై ఆర్పీ సింగ్ స్పందించారు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ మంజూరు చేసిన సమయంలో కోర్టు పెట్టిన షరతులను కేజ్రీవాల్ గుర్తుంచుకోవాలన్నారు. కేజ్రీవాల్ ఎప్పుడూ సీఎం అభ్యర్థి గురించే మాట్లాడుతున్నారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తానే సీఎం అభ్యర్థిని అని... బీజేపీ నుంచి ఎవరు అని ఆయన ఆలోచిస్తున్నారని, కానీ కోర్టు పెట్టిన షరతుల ప్రకారం ఆయన సీఎం కాలేరన్నారు.

ఆయన ఎలాంటి దస్త్రాలపై సంతకాలు చేయరాదన్నారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై... ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న కేజ్రీవాల్ కనీసం సీఎం కార్యాలయానికి కూడా వెళ్లరాదన్నారు. ఇప్పటికీ కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ ఆయన ప్రతిసారి సీఎం అభ్యర్థి గురించి మాట్లాడుతున్నారని, తమ సీఎం అభ్యర్థి కమలం పువ్వు గుర్తే అన్నారు. మా పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి నీతిమంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరతారని తెలిపారు.

  • Loading...

More Telugu News