Cognizant: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కీలక నిర్ణయం

- పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచిన కాగ్నిజెంట్
- భారత్‌లో అన్ని కార్యాలయాలకు వర్తిస్తుందని జాతీయ మీడియాలో కథనాలు
- అనుభవజ్ఞుల సేవలను సద్వినియోగం చేసుకోవడానికి పెంపు!
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచింది. ఈ మేరకు కంపెనీ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. భారత్‌లోని కాగ్నిజెంట్ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని వార్తలు వస్తున్నాయి.
పలు ఐటీ సంస్థలు తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్లుగా నిర్ణయించాయి. తాజాగా కాగ్నిజెంట్ ఈ వయస్సును 60కు పెంచింది. అనుభవజ్ఞులైన నిపుణుల సేవలను సద్వినియోగం చేసుకోవడానికి పదవీ విరమణ వయస్సును పెంచింది.