Leopard: తిరుపతిలో ఓ వ్యక్తిపై చిరుతపులి దాడి

- తిరుపతి జూపార్క్ రోడ్ లో చిరుత కలకలం
- సైన్స్ సెంటర్ వద్ద వ్యక్తిపై దాడి
- తీవ్రంగా గాయపడిన వ్యక్తి
ఆధ్యాత్మిక నగరం తిరుపతి శేషాచలం అడవులను ఆనుకుని ఉంటుందన్న సంగతి తెలిసిందే. తిరుపతి-తిరుమల కొండలపై వన్యప్రాణి సంచారం ఎక్కువగా ఉంటుంది. పలుసార్లు వన్య ప్రాణులు తిరుపతిలో జనావాసాల్లోకి వచ్చిన సంఘటనలు జరిగాయి.
తాజాగా, తిరుపతిలోని జూపార్క్ రోడ్ లో చిరుతపులి కలకలం రేగింది. ఇక్కడి సైన్స్ సెంటర్ వద్ద చిరుతపులి ఓ వ్యక్తిపై దాడి చేసింది. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చిరుత బారినపడిన వ్యక్తిని టీటీడీ ఉద్యోగి మునికుమార్ గా గుర్తించారు. అతడు బైక్ పై వెళుతుండగా చిరుత దాడి చేసినట్టు తెలిసింది.