Balakrishna: 'డాకు మహారాజ్' ఊహలకు మించి ఉంటుంది: బాలకృష్ణ

Balakrishna speaks about his Daku Maharaj movie
  • రేపు విడుదల అవుతున్న 'డాకు మహారాజ్'
  • ట్రైలర్ కు మించి సినిమా ఉంటుందన్న బాలయ్య
  • తన సంక్రాంతి సినిమాలన్నీ హిట్ అయ్యాయని వ్యాఖ్య
బాలకృష్ణ తాజా చిత్రం 'డాకు మహారాజ్' సంక్రాంతి కానుకగా రేపు విడుదల అవుతోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ... సంక్రాంతికి విడుదలైన తన సినిమాలన్నీ హిట్ అయ్యాయని... ఈ సినిమా కూడా అంచనాలకు మించి ఉంటుందని చెప్పారు. ట్రైలర్ కి మించి సినిమా ఉంటుందని తెలిపారు. తన ధైర్యం, తన పొగరు తానేనని... తాను ఎవరి కీర్తినీ మోయనని, తన కీర్తిని కిరీటంగా అలంకరించుకుని తలపై మోస్తానని చెప్పారు. 'నేను డాకు మహారాజ్. చరిత్ర సృష్టించాలన్నా నేనే... దాన్ని తిరగరాయాలన్నా నేనే' అని సినిమాలోని డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు. 

తనకు పొగరు ఉందని అంటుంటారని... అదే పొగరుతో తన క్యారెక్టర్ ని బిల్డప్ చేసుకుంటానని బాలకృష్ణ తెలిపారు. త్వరలోనే... 'అఖండ 2'లో విశ్వరూపం చూస్తారని అన్నారు. ప్రతి సినిమాను వైవిధ్యభరితంగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. ప్రతిభ కలిగిన నటీమణులు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. 'యానిమల్' సినిమాకు ముందే బాబీ డియోల్ ను ఈ సినిమాలో తీసుకున్నామని వెల్లడించారు. ఇక ముందు కూడా మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తానని చెప్పారు.
Balakrishna
Daku Maharaj Movie
Tollywood

More Telugu News