Samantha: ఆ నొప్పుల నుంచి కోలుకోవడంలో చాలా ఫన్ ఉంది: సమంత

Samantha suffering from Chikungunya

  • ఇటీవల చికున్ గున్యా బారిన పడ్డ సమంత
  • కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడంలో కూడా ఫన్ ఉందన్న సామ్
  • మళ్లీ యాక్టింగ్ లో బిజీ అవుతున్న సమంత

జీవితంలో ఆటుపోట్లు, అనారోగ్య సమస్యలను సైతం తట్టుకుని నిలబడ్డ సమంతను ఐరన్ లేడీ అనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా ఆమె చికున్ గున్యా బారిన పడ్డారు. ఈ విషయం గురించి ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చికున్ గున్యా కారణంగా వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడంలో కూడా చాలా ఫన్ ఉందని ఆమె అన్నారు. దీనికి బాధతో కూడిన ఎమోజీని జత చేశారు. దీంతో, చికున్ గున్యా నుంచి త్వరగా కోలుకుని సాధారణ స్థితికి రావాలని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు. 

సినిమాల విషయానికి వస్తే... సమంత 'మా ఇంటి బంగారం' అనే సినిమాను ఇటీవల ప్రకటించారు. దీనికి తోడు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో 'రక్త్ బ్రహ్మాండ్' వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News