Cockfight: ఏలూరు జిల్లాలోని పలు గ్రామాల్లో కోడి పందేల బరులను ధ్వంసం చేసిన పోలీసులు

Cockfight crackdown in Godavari districts

  • కోడిపందేలకు సిద్ధమైన ఉభయగోదావరి జిల్లాలు
  • అనుమతి లేదంటున్న పోలీసులు
  • కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే సంక్రాంతి సందడి నెలకొంది. హైదరాబాద్ నుంచి జనాలు సంక్రాంతి కోసం స్వగ్రామాలకు బయల్దేరుతున్నారు. ఇక కోస్తాంధ్రలో పందేలరాయుళ్లు కోడిపందేలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల బరులు రెడీ అయిపోయాయి. 

ఈ నేపథ్యంలో కోడిపందేలపై పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో కోడిపందేల బరులను పోలీసులు ధ్వంసం చేశారు. కోడిపందేల నిర్వాహకులకు జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కోడిపందేలు, గుండాట, కోతాటలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

ఏలూరు జిల్లా నూజివీడు, ఆగిరిపల్లి మండలాల్లో బరులను ట్రాక్టర్లతో పోలీసులు దున్నించారు. కోడిపందేలకు అనుమతులు లేవని నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో కూడా బరులను ట్రాక్టర్లతో దున్నించారు. సంక్రాంతికి మూడు రోజుల పాటు కోడిపందేలకు అనుమతి వస్తుందనే ధీమాతో నిర్వాహకులు బరులను సిద్ధం చేశారు. అయితే, చిన్న సమాచారం అందినా పోలీసులు అక్కడకు  వచ్చి బరులను ధ్వంసం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News