నేడు హైదరాబాద్ లో 'డాకు మహరాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్
- నిన్న అనంతపురంలో జరగాల్సిన 'డాకు మహరాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్
- తిరుపతి తొక్కిసలాట ఘటన కారణంగా రద్దైన ఈవెంట్
- నేడు హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న అనంతపురంలో జరగాల్సి ఉంది. అయితే, తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్స్ జారీ చేసే సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన నేపథ్యంలో ఈవెంట్ ను రద్దు చేశారు.
ఈవెంట్ రద్దు కావడంతో బాలయ్య ఫ్యాన్స్ కొంత డీలా పడ్డారు. దీంతో వారి కోసం మరో ఈవెంట్ ను మేకర్స్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో ఈ సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.