Revanth Reddy: హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy says will build Future city

  • ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందన్న సీఎం
  • రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే కల అన్న రేవంత్ రెడ్డి
  • ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుందన్న సీఎం

హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందన్నారు. సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ... హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే తన కల అన్నారు.

ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ సిద్ధమవుతోందని సీఎం అన్నారు. హైదరాబాద్ ను వరదలు లేని నగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్‌ను అనుసంధానించే రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఉన్న ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుందన్నారు. నైపుణ్యాలు, ఉద్యోగ కల్పనపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు.

రాష్ట్రానికి తీర ప్రాంతం లేదని, అందుకే డ్రైపోర్టు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే అద్భుతాలు సృష్టించవచ్చునన్నారు. హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకు వస్తున్నామని, ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును తొలగించామన్నారు.

  • Loading...

More Telugu News