army captain: ఆర్మీ అధికారిని అంటూ మహిళలకు టోకరా!

class 8 dropout poses as army captain cheats 20 women of lakhs arrested in up

  • ఆర్మీ అధికారిగా, హిందువుగా నమ్మించి మహిళలను మోసం చేసిన హైదర్ అలీ
  • ఓ మహిళ అనుమానంతో హైదర్ మోసాల చిట్టా వెలుగులోకి
  • హైదర్ అలీని అరెస్టు చేసిన లక్నో పోలీసులు

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన హైదర్ అలీ (40) తనను తాను ఆర్మీ మెడికల్ కార్ప్స్ అధికారి హార్టిక్ బెగ్లోగా పరిచయం చేసుకొని మహిళలను ప్రేమలోకి దింపి మోసాలకు పాల్పడుతున్నాడు. 8వ తరగతి ఫెయిలైన హైదర్ ఆర్మీ కెప్టెన్‌గా ప్రచారం చేసుకుంటూ మహిళలను నమ్మించి వారితో శారీరక సంబంధం పెట్టుకుని తర్వాత డబ్బులు తీసుకుని ఉడాయించేవాడు. మహిళలను మోసం చేస్తూ వచ్చిన డబ్బులతో నిందితుడు విలాసవంతమైన జీవనం గడిపేవాడు. 

పోలీసులకు దొరక్కుండా దాదాపు 20 మంది మహిళలను మోసం చేసిన హైదర్.. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన మహిళ ఫిర్యాదుతో పోలీసులకు దొరికిపోయాడు. ఆర్మీ అధికారినని చెప్పుకుంటున్న హైదర్ అధికారిక వాహనంలో కాకుండా బైక్ పైన తిరుగుతుండటంతో ఆ మహిళకు అనుమానం వచ్చింది. ఆమె ఫిర్యాదుతో హైదర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాల చిట్టా బయటపడింది. 

హైదర్ దేశంలోని పలు నగరాల్లోని సెక్యూరిటీ సంస్థల్లో పని చేసినట్లు గుర్తించారు. ఇలా ప్రతి నగరంలోనూ మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేస్తూ వారి డబ్బుతో పరారయ్యేవాడు. అతను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ సృష్టించి, ఆర్మీ యూనిఫాంలో ఉన్న ఫోటోలు పోస్ట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అతను ఉంటున్న ఇంట్లో తనిఖీలు చేసి ఆర్మీకి చెందిన పలు యూనిఫాంలు, హార్దిక్ బంగ్లో పేరుతో ఉన్న నకిలీ అధార్ కార్డు, పాన్ కార్డు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

అడిషనల్ డిప్యూటి కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు హైదర్ ఆరు నెలల క్రితం మహిళ పేరుతో ఫైనాన్స్‌లో బైక్ తీసుకున్నాడని, ఆ బైక్‌ను మహిళ ఇంట్లో ఉంచాడన్నారు. 15 రోజుల క్రితం లక్నోకు వచ్చిన అతను అధికారిక ఆర్మీ వాహనంలో ఆఫీసుకు వెళ్లకుండా బైక్‌పై తిరుగుతుండటంతో అనుమానం వచ్చి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేయడంతో మోసాల చిట్టా వెలుగుచూసింది. 

  • Loading...

More Telugu News