Vaikunta Dwara Darshanam: తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్ద తోపులాట.. ఆరుగురు మృతి

Four died at Vaikunta Dwara Darshanam token issue counters in Tirumala

  • తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు
  • రేపటి నుంచి టోకెన్ల జారీ
  • తిరుపతిలోని టోకెన్ జారీ కేంద్రాల వద్దకు పోటెత్తిన భక్తులు
  • తిరుపతిలోని మూడు కేంద్రాల వద్ద భారీ తోపులాట 
  • మృతుల్లో ఐదుగురు  మహిళలు

తిరుమలలో ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దర్శనాల కోసం తిరుపతి, తిరుమలలో రేపటి నుంచి టోకెన్ల జారీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే, భక్తులు ముందుగానే టోకెన్ జారీ కేంద్రాల వద్దకు భారీగా తరలివచ్చారు. 

ఈ క్రమంలో, తిరుపతిలోని శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం వద్ద ఉన్న టోకెన్ జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య భారీగా తోపులాట చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు సొమ్మసిల్లి పడిపోవడంతో వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ ఆరుగురు  మృతి చెందారు. వారిలో ఐదుగురు  మహిళలు ఉన్నట్టు గుర్తించారు. 

ఈ ఘటనపై స్పందించిన అధికారులు ఘటన స్థలాలకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల వద్దకు అదనపు పోలీసు బలగాలను తరలించారు.

  • Loading...

More Telugu News