Honey Rose: హీరోయిన్ హనీరోజ్ పై లైంగిక వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్

Business man who harassed Honey Rose arrested

  • హనీరోజ్ ఫిర్యాదు మేరకు 27 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • వ్యాపారవేత్త బాబీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు
  • బాబీని అరెస్ట్ చేయడంపై ఆనందం వ్యక్తం చేసిన హనీరోజ్

సోషల్ మీడియా వేదికగా తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ సినీ నటి హనీరోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు ఎర్నాకులం పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు. 

ఒక వ్యక్తి తనను ఉద్దేశపూర్వకంగా డబుల్ మీనింగ్ కామెంట్స్ చేస్తూ అవమానిస్తున్నాడని హనీరోజ్ తెలిపింది. అతను ఓ బిజినెస్ మేన్ (బాబీ చెమ్మనూరు) అని చెప్పింది. గతంలో కొన్ని కార్యక్రమాలకు తనను ఆహ్వానించాడని... అయితే ఇతర కారణాల వల్ల తాను వెళ్లలేదని... దీంతో తనపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. తాను హాజరయ్యే ప్రతి ఈవెంట్ కు రావడం... వీలు కుదిరినప్పుడు కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం చేస్తున్నాడని చెప్పింది. అసభ్యకరంగా చేసే కామెంట్లను తాను సహించలేనని... అందుకే తాను పోలీసులను ఆశ్రయించానని తెలిపింది. 

మరోవైపు, హనీరోజ్ ఫిర్యాదు మేరకు బాబీ చెమ్మనూరును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా హనీరోజ్ స్పందిస్తూ... తనకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఈ విషయాన్ని తాను ఇప్పటికే సీఎం పినరయి విజయన్ దృష్టికి తీసుకెళ్లానని... నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తనకు మాట ఇచ్చారని వెల్లడించింది.  

  • Loading...

More Telugu News