భార్య కదలికలను రహస్యంగా కనిపెట్టే భర్తకథ... 'అథోముగం'... ఓటీటీలో!
- తమిళంలో రూపొందిన 'అథోముగం'
- థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్
- ఈ నెల 10 నుంచి 'ఆహా తమిళ్'లో స్ట్రీమింగ్
- సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ
ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా 'ఆహా తమిళ్'లో స్ట్రీమింగ్ కానుంది. నిజానికి ఈ సినిమాలో పెద్ద తారాగణం లేదు... ఖర్చుపరంగా భారీతనం కూడా కనిపించదు. కానీ అనూహ్యమైన మలుపులతో సాగిపోతూ అడుగడుగునా ఈ కథ ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే పరంగా మొదటి నుంచి చివరివరకూ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
కథ విషయానికి వస్తే... మార్టిన్-లీనా కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన భార్యాభర్తలు. కొత్తగా ఒక యాప్ వచ్చిందనీ... ఆ యాప్ ను ఇతరుల ఫోన్లో ఇన్ స్టాల్ చేస్తే, వారికి సంబంధించిన రహస్య సమాచారం... దృశ్యాలతో పాటు మనకి తెలిసిపోతుందని మార్టిన్ కి ఒక ఫ్రెండ్ చెబుతాడు. దాంతో తన భార్య లీనా ఫోన్లో ఆ యాప్ ను మార్టిన్ ఇన్ స్టాల్ చేస్తాడు. ఆమె గురించి అతనికి ఏం తెలుస్తుంది? ఆ ఇద్దరిలో ఎవరి లోపలి ముఖం (అంతర్ముఖం) ఎలాంటిది? అనేదే ఈ 'అథోముగం' కథ.