Ramcharan: సంక్రాంతి కంటెంట్: ఒక్కో సినిమాలో ఒక్కో అంశంపై ఫోకస్!

- డిఫరెంట్ కంటెంట్ తో ఢీ కొడుతున్న సినిమాలు
- ఈ నెల 10న విడుదలవుతున్న 'గేమ్ ఛేంజర్'
- 12న థియేటర్లకు వస్తున్న 'డాకు మహారాజ్'
- 14వ తేదీన రిలీజ్ అవుతున్న 'సంక్రాంతికి వస్తున్నాం'
సంక్రాంతి పండుగ దగ్గర పడుతోంది. పండుగ సందర్భంగా విడుదల కానున్న మూడు సినిమాల కోసం చాలామంది ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ మూడు సినిమాలలో ముందుగా 'గేమ్ ఛేంజర్' ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 10వ తేదీన ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పాటల చిత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. సినిమాలోని 5 పాటలకుగాను 75 కోట్లను ఖర్చు చేశారు. మొదట ఈ టాక్ బయటికి వచ్చినప్పుడు, రూమర్ కావొచ్చని అనుకున్నారు. కానీ ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా చెప్పడంతో అందరిలో ఆసక్తి పెరిగింది.


ఈ నెల 14వ తేదీన 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రేక్షకులను పలకరించనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అనిల్ రావిపూడికి కామెడీపై ఉన్న పట్టు గురించి తెలియనిది కాదు. ఇక కామెడీ చేయడంలో వెంకటేశ్ కి గల నైపుణ్యాన్ని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఇలా ఈ మూడు సినిమాలలో ఒక్కోటి ఒక్కో అంశంపై ఎక్కువ ఫోకస్ చేస్తూ, తమ కంటెంట్ ను థియేటర్స్ కి తీసుకొస్తున్నారు. ఈ సినిమాలు ఏ రేంజ్ లో అలరిస్తాయో చూడాలి మరి.