Yarlagadda Venkata Rao: ప్రజల నుంచి తీసుకున్న అర్జీలపై అసెంబ్లీలో మాట్లాడతారా?: జగన్ కు యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్న

Yarlagadda Venkata Rao comments on Jagan

  • అర్జీలను తీసుకుని జగన్ ఏం చేస్తారన్న యార్లగడ్డ
  • వైసీపీ హయాంలో ఫోన్లో మాట్లాడేందుకు కూడా ప్రజలు భయపడేవారని వ్యాఖ్య
  • ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛను అనుభవిస్తున్నారన్న యార్లగడ్డ

ఇటీవల పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ... అర్జీలను తీసుకుని జగన్ ఏం చేస్తారని ప్రశ్నించారు. వాటిపై అసెంబ్లీలో మాట్లాడతారా? అని అడిగారు. 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే... వాట్సాప్ కాల్స్ నుంచి మామూలు ఫోన్లు మాట్లాడుకునే స్థితికి ప్రజలు వచ్చారని... ప్రజలు ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నారో చెప్పడానికి ఇది నిదర్శనమని చెప్పారు. వైసీపీ హయాంలో ఫోన్లో మాట్లాడటానికి కూడా ప్రజలు భయపడేవారని అన్నారు. ఆరు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఎంతో చేసిందని... దీనిపై చర్చించడానికి దమ్ముంటే వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News